ఏపీలో నేటి నుంచి ఉచిత ఇసుక ఆన్లైన్ బుకింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురువారం నుంచి ఉచిత ఇసుక ఆన్లైన్ బుకింగ్ విధానం అమలు కానుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఉచిత ఇసుక పోర్టల్ ను ఆవిష్కరించనున్నారు. దీంతో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇసుక బుక్ చేసుకునే అవకాశం ఉంది. అధికారుల నుంచి ఇసుక రవాణాదారుల వరకు ఎలాంటి తప్పులు చేయకుండా పోర్టల్ రూపకల్పన చేశారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ అధికారుల నేతృత్వంలో కమిటీలు వేశారు.