కోనసీమ జిల్లాలో రామచంద్రపురం నియోజకవరంలోని కొత్తూరులో సోమవారం మంత్రి వాసంశెట్టి సుభాశ్ పింఛన్లను
పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. దివ్యాంగ మహిళ మంత్రి చేతుల మీదుగా పింఛన్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. అమరావతి అభివృద్ధికి పింఛన్ డబ్బు నుంచి రూ.3000ను మంత్రికి విరాళంగా ఇచ్చింది. దీంతో మహిలను పలువురు అభినందించారు.