విద్యార్థులు పుస్తక పఠనాన్ని హాబీగా మలుచుకోవాలని ప్రతి రోజు గ్రంథాలయాలను సందర్శిస్తూ ఉండాలని రామచంద్రపురం ఆర్డీవో దేవరకొండ అఖిల విద్యార్థులకు సూచించారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభ బుధవారం చిలికాని రామారావు స్మారక భవనంలో లైబ్రేరియన్ డి. వెంకటరమణ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీవో అఖిల పాల్గొని విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో చందమామ వాసు పాల్గొన్నారు.