రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం అభినందించారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మంత్రి సుభాష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఎమ్మెల్సీ ఓటరు నమోదు శాతాన్ని 90 శాతం దాటించి సత్తా చూపించావు అంటూ అభినందించారు. అలా కసిగా పనిచేయాలి అంటూ ప్రోత్సహించారు.