గర్భిణులు తప్పనిసరిగా పోషకాహారాన్ని తీసుకోవాలని మంత్రి వాసంశెట్టి సుభాశ్ అన్నారు. ఆయన రామచంద్రపురంలోని లయన్స్ క్లబ్ వద్ద ఐసీడీఎస్ అధికారులు నిర్వహించిన పోషకాహారమాస ఉత్సవాల్లో గురువారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం చిత్త శుద్ధితో పని చేస్తుందని, గర్భిణులకు నాణ్యతతో కూడిన కిట్లను అందిస్తున్నామన్నారు.