పురుగుమందులు వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలని కాకినాడ జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలోని కాజులూరు మండలం శీల గ్రామంలో మండల వ్యవసాయ అధికారివి. అశోక్ ఆధ్వర్యంలో గురువారం పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా వ్యవసాయాధికారి ఎన్. విజయ్ కుమార్ మాట్లాడుతూ సేంద్రియ ఎరువుల వాడకం లోని మెలకువలను వివరించారు.