బిజెపి మండల అధ్యక్షులు ఆకేటి శ్రీకృష్ణ అధ్యక్షతన రామచంద్రపురం మండలం ద్రాక్షారామంలో సోమవారం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ అధ్యక్షులు యాళ్ల దొరబాబు పాల్గొన్నారు. ఆయన ప్రతి బూత్‌లో 200 సభ్యత్వాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు మోకా వెంకట సుబ్బారావు, యిళ్ళ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.