రాజానగరం: పోలీసు అమరుల సేవలను మరువలేనవి
'పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం' సందర్భంగా కోరుకొండ పోలీస్ స్టేషన్ సిబ్బంది, అధికారుల ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ ర్యాలీలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో పోరాడిన పోలీస్ అమరుల సేవలను జాతి ఎన్నటికీ మరువదన్నారు. అమరుల స్ఫూర్తితో పోలీసు ఉద్యోగులు తమ విధి నిర్వహణకు పునరంకితం కావాలని ఆకాంక్షించారు.