రాజానగరం: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి
రాజానగరంలోని మండలం తూర్పు గోనగూడెం సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తొండంగి మండలం వలసపాకల అగ్రహారానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెంకటరమణ మృతి చెందాడు. కారులో అతడు రాజానగరం నుంచి గండేపల్లి వైపు వెళ్తుండగా మలుపు తీసుకోవడంతో ఢీవైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ వీరయ్య గౌడ్ తెలిపారు.