సమస్త భక్తజనులు పరమ పవిత్రంగా భావించే తిరుమలలో కల్తీ ఘటనకు పాల్పడిన బాధ్యులకు శిక్ష తప్పదని రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. శనివారం రాజానగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా తాను కూడా దీక్ష చేపట్టి, లోకకళ్యాణార్థం, తిరుమల లడ్డు పవిత్రత కోరుతూ విశేష యాగ పూజలు చేశామన్నారు.