గ్రామీణ ప్రాంతాలే దేశ ప్రగతికి సోపానాలని, దేశానికి పట్టుకొమ్మలని రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. రాజానగరం నియోజకవర్గంలోని ఎంపీడీవోలతో ఎమ్మెల్యే బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈనెల 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు పల్లె పండుగ వారోత్సవాలను నిర్వహించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారంతో పాటు రోడ్లు, డ్రైనేజీలు అభివృద్ధి చేయాలన్నారు.