రాజానగరంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీ రాజమండ్రి గర్ల్స్ క్యాంపస్ హాస్టల్ విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని బుధవారం ధర్నా నిర్వహించారు. అన్నంలో పురుగులు ఉన్నాయని, భోజనం సరిగా వండట్లేదని ఆందోళనలు చేపట్టారు. విషయం తెలుసుకున్న రాజానగరం ఎమ్మెల్యే బలరామకృష్ణ ఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి సమస్య వారం రోజుల్లో పరిష్కరించడం జరుగుతుందని విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానన్నారు.