డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మంగళవారం నిర్వహించిన 'జనవాణి' కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వెంటనే వారి సమస్యలను సంబంధిత అధికారులకు తెలియజేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.