అమరావతిలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఈనెల 22, 23వ తేదీన నిర్వహించనున్న జనవాణి కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సోమవారం తెలిపారు. ప్రజా ప్రభుత్వ పాలనకు నిదర్శనం కూటమి ప్రభుత్వం అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చే ప్రజల నుండి వినతులు స్వీకరించి సమస్యలు పరిష్కరించడానికి సర్వం సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.