రాజనగరం మండలం దివాన్ చెరువు రామాలయం జంక్షన్ వద్ద కంటైనర్ లారీ ఢీ కొని రంగంపేట మండలం వెంకటాపురానికి చెందిన రైతు నాగేశ్వరరావు (42) మృతి చెందాడు. బైక్ పై ఉల్లిపాయల బస్తా తీసుకు వెళుతుండగా లారీ ఉల్లిపాయల బస్తాను ఢీ కొట్టిందని బొమ్మూరు ఎస్ఐ ప్రేమ్ కుమార్ శుక్రవారం తెలిపారు. దీంతో బైకు అదుపు తప్పి లారీ వెనుక చక్రం కింద పడి నాగేశ్వరరావు మృతి చెందాడన్నారు. దీనిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.