కోరుకొండ మండల తహశీల్దార్ కార్యాలయాన్ని శనివారం కలెక్టర్ ప్రశాంతి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్ కార్యాలయంలోని ఉద్యోగుల వివరాలు, వారి హాజరును ఆమె పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలందరికీ జవాబుదారీతనంతో కూడిన సేవలను అందించాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు.