క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడం, నివారించడం, చికిత్స చేయడం గురించి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా నవంబర్ 7న క్యాన్సర్ పై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. శుక్రవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టర్ వద్ద రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులతో చేపట్టిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు వివిధ సేవ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.