కడియం మండలం దుళ్ళ గ్రామంలో పొలంబడి కార్యక్రమాన్ని బుధవారం మండల వ్యవసాయ అధికారిని ద్వారకాదేవి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూ. గో జిల్లా ఏడి శ్రీనివాసరెడ్డి పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు అనుసరించి వ్యవసాయ ఉత్పత్తులు పండించడం ద్వారా రైతులు మేలైన నాణ్యమైన, అధిక దిగుబడులు సాధించవచ్చని పేర్కొన్నారు.