నాగుల చవితి సందర్భంగా కడియం మండలం కడియపులంక పంచాయతీ పరిధిలోని బుర్రిలంక గ్రామంలో కొలువైయున్న శ్రీ వీరన్న బాబు ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే మహిళలు ఉపవాసంతో నాగులుకు ఇష్టమైన నైవేద్యాలను ఉంచి పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు.