ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు వర్ష సూచన!
ఏపీకి మరో తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో శనివారం నాటికి ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది తీవ్ర వాయుగుండంగా మారి ఈ నెల 17 నాటికి ఏపీలోనే తీరం దాటవచ్చని అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గోదావరి, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, వైఎస్ఆర్, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.