పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన కుమారుడు జీవి సుందర్‌ను ఓటర్లు గెలిపించాలని మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్ కోరారు. సోమవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సేవా గుణం, ప్రశ్నించే కుటుంబం తమదని పేర్కొన్నారు. తన లాగే పోరాడే సుందర్‌ను గెలిపించాలని, ప్రజా సమస్యలపై పోరాడకపోతే తానే ముందు ఉండి ప్రశ్నిస్తానని హామీ ఇచ్చారు.