కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని భక్తుల రద్దీ దృష్ట్యా స్నానపు ఘాట్లు, ఆలయాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఘాట్లు, ఆలయాల వద్ద పోలీసు సూచనలను భక్తులు పాటించి కార్యక్రమాలను జరుపుకోవాలన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా విధించిన ట్రాఫిక్ ఆంక్షలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు.