తూ. గో జిల్లాలోని ఆరు ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రత్యేక పర్యాటక బస్సును రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ రాజమండ్రిలోని సరస్వతి ఘాటు వద్ద శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ మేరకు 20 మంది యాత్రికులతో బయలుదేరిన ఈ బస్సును ఆయన పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఫోన్ చేసి యాత్రికులు ఈ బస్సు సీటును ముందస్తుగా నమోదు చేసుకోవచ్చని పర్యటకశాఖ అధికారులు తెలిపారు.