తూ. గో జిల్లాలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. మంగళవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమె అధికారులతో సమావేశం నిర్వహించారు. దివ్యాంగుల సంక్షేమం కోసం గూగుల్ షీట్ ఏర్పాటు చేసి జిల్లాలోని ఎంపీడీవోలను పొందుపరిచి, దివ్యాంగుల అవసరాలను గుర్తించాలని అధికారులకు సూచించారు. దివ్యాంగులకు అందుతున్న సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు.