రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద కలెక్టర్ ప్రశాంతి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియపై వారికి వివరాలను తెలిపారు. గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పట్టబద్రుల ఓటర్లుగా ఈనెల 17వ తేదీ నాటికి 63, 282 మంది ఓటర్లు తమ ఓట్లను నమోదు చేయించుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.