ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. గురువారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. రాజమండ్రి నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. తాను ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అన్ని నెరవేరుస్తానని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని పేర్కొన్నారు.