ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలనకు 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా రాజమండ్రిలోని 46, 47, 48, 49 డివిజన్లకు సంబంధించి 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు.