ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. జయ సూర్యను తూర్పు గోదావరి జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు రాజమండ్రి పర్యటనలో ఆర్ & బి అతిథి గృహం వద్ద శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు జాయింట్ కలెక్టర్ పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకు చెందిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఆయనను కలిశారు.