కాకినాడలోని డీ కన్వెన్షన్ హాల్ వద్ద డిసెంబర్ పదో తేదీన జరిగే అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పోస్టర్ను శుక్రవారం రాత్రి కమిషనర్ భావన ఆవిష్కరించారు. హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ కాకినాడ సభ్యులు కమిషనర్ భావనను మర్యాదపూర్వకంగా కలిశారు. తమ ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో సమాజానికి విశేష సేవలు అందించడం జరిగిందన్నారు.