ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 26 జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లాకు మంత్రి నిమ్మల రామానాయుడు, కాకినాడ జిల్లాకు మంత్రి పొంగూరు నారాయణ, బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు లను నియమించారు.