గృహనిర్మాణ శాఖ ద్వారా మంజూరైన ఇళ్ల నిర్మాణాలను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని, లేదంటే మంజూరైన ఇల్లు రద్దవుతాయని రాజమండ్రి గృహనిర్మాణ శాఖ ఈఈ రాజగోపాల్ తెలిపారు. శనివారం కడియం మండలం జేగురుపాడులో 'మన ఇల్లు-మన గౌరవం' పేరుతో గృహ నిర్మాణ లబ్ధిదారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. మొత్తం ఈ లేఅవుట్లో 2020 మందికి ఇల్ల స్థలాలు కేటాయించగా మొదటి విడతగా 1, 406 మందికి మంజూరైనట్లు చెప్పారు.