ట్విటర్ వేదికగా స్పందించిన పిఠాపురం ఎమ్మెల్యే
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 'మహాయుతి' కూటమి విజయం సాధించిన పట్ల డిప్యూటీ సీఎం, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. పవన్ ప్రచారం చేసిన మెజారిటీ స్థానాల్లో మహాయుతి అభ్యర్థులు గెలిచారు. ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన, ప్రధాని మోడీ నాయకత్వంపై రాష్ట్ర ప్రజలు నమ్మకం ఉంచారని, అభివృద్ధి కోసం ఓటేశారని తెలిపారు.