చోరీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
దసరా పండగ సందర్భంగా ప్రజలు ఉత్సవాల్లో ఉన్న సమయాల్లో అధికంగా చోరీలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని గొల్లప్రోలు ఎస్ఐ ఎన్. రామకృష్ణ కోరారు. బుధవారం రాత్రి గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలో ప్రజలకు అవగాహన కల్పించారు. గొల్లప్రోలులో, మండలంలోని గ్రామాల్లో మైకు ద్వారా ప్రచారం సాగించారు. దసరా సెలవులకు ఇంటికి తాళాలు వేసి ఇతర ఊళ్లు వెళ్లే వారు పర్య వేక్షణకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.