ఏపీ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభవార్త చెప్పారు. పెండింగ్ జీతాల చెల్లింపులతో పాటుగా ఉద్యోగ భద్రతను కూడా కల్పించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇక నుంచి ప్రతి నెలా జీతం ఇచ్చేందుకు ఏర్పాట్లు మొదలు పెట్టినట్లు సమాచారం. ఈ మేరకు బకాయిల కోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇప్పటికే రూ.24 కోట్లు విడుదల చేసింది.