ఏలేరు వరద ఉద్ధృతికి మంగళవారం పిఠాపురం గొల్లప్రోలు హైవే దిగ్బంధమైంది. దీంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. కాకినాడ జిల్లా పిఠాపురంలోని 216వ జాతీయ రహదారి మీదుగా ఏలేరు వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. దీంతో కాకినాడ నుంచి కత్తిపూడి వెళ్లే వాహనాలను అధికారులు, పోలీసులు నిలిపివేస్తున్నారు. గొల్లప్రోలు పట్టణం ప్రస్తుతం పూర్తి జలదిగ్బంధంలో ఉన్నట్లు తెలుస్తోంది. అటు గొరిఖండ్రి వాగు పొంగిపొర్లుతోంది.