పిఠాపురం: రోడ్డుకిరువైపులా దుకాణదారులు ఆక్రమిస్తే చర్యలు

80பார்த்தது
పిఠాపురం: రోడ్డుకిరువైపులా దుకాణదారులు ఆక్రమిస్తే చర్యలు
రోడ్డుకిరువైపులా దుకాణాలు నిర్వహించే వ్యాపారులు వాహనాలను రోడ్డుపై నిలపొద్దని సీఐ జి. శ్రీనివాస్ సూచించారు. బుధవారం పిఠాపురం ఉప్పాడ సెంటర్ నుంచి చర్చి సెంటర్ వరకు విజువల్ పోలిసింగ్ కార్యక్రమంలో భాగంగా ఎస్ఐ మణికుమార్, సిబ్బందితో కలిసి ఆయన పర్యటించారు. పిఠాపురం పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు సృష్టిస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. రోడ్డు ఆక్రమణలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని మీడియాకు తెలిపారు.

தொடர்புடைய செய்தி