కాకినాడ జిల్లాలో గోదావరి తూర్పు డెల్టా, పిఠాపురం బ్రాంచి కెనాల్, ఏలేరు రిజర్వాయర్ వ్యవస్థల క్రింద 2024-25 రబీ సీజనులో ఫసలీ-1434 పంటలకు పూర్తి ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేసేందుకు జిల్లా సాగునీటి సలహా మండలి తీర్మానించింది. బుధవారం కాకినాడలో కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలులో కాకినాడ జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధ్యక్షతన జరిగింది.