గ్రామీణ రహదారుల అభివృద్ధికి పల్లెపండుగ పేరిట ప్రభుత్వం నిధులు కేటాయించడంతో మహర్థశ ఏర్పడుతుందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఆదివారం సామర్లకోట మండలం వేట్లపాలెం బీసీ కాలనీలో రు. 45 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో గోలి శ్రీరామ్, వెంకట లక్ష్మి, గుమ్మళ్ళ రామకృష్ణ, కొండపల్లి కృష్ణమూర్తి పాల్గొన్నారు.