కొత్తపేట: మందపల్లి లంక భూములపై 22/ఏ సెక్షన్ తొలగించండి
కొత్తపేట మండల పరిధిలోని మందపల్లి కేదార్లంక లంక భూములు పై ఉన్న 22/ఎ సెక్షన్ తొలగించాలని కోరుతూ టిడిపి మండల అధ్యక్షుడు కంఠంశెట్టి శ్రీను ఆధ్వర్యంలో గుబ్బల మూర్తి లంక భూముల రైతులు సోమవారం కొత్తపేట ఆర్డీవో కార్యాలయం నందు జరిగిన గ్రీవెన్స్ లో ఆర్డిఓ శ్రీకర్ కు వినతిపత్రం సమర్పించారు. సెక్షన్ 22 /ఎ వలన లంక భూమి రైతుల స్వాధీనంలో ఉన్న జిరాయితీ భూములకు రిజిస్ట్రేషన్ లావాదేవిలు జరగడం లేదని తెలిపారు.