నూతన ఎక్సైజ్ విధానం వల్ల అధిక సంఖ్యలో దరఖాస్తులు రావచ్చని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్ కె డి ప్రసాదరావు తెలిపారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయం వద్ద సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఆక్వా రంగంలో నష్టపోయిన వారు వేరే ప్రత్యామ్నాయ మార్గం లేక ఈ నూతన ఎక్సైజ్ విధానం వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. ఈనెల 11వ తేదీన కలెక్టరేట్లో డ్రా తీయనున్నట్లు చెప్పారు.