కాకినాడ రూరల్: 104 ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలి
104 ఉద్యోగులను సమస్యలను పరిష్కరించి 104 వైద్య సేవలను పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ ద్వారా వైద్య సేవలు అందించాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కరప మండలం ఉప్పలంక గ్రామ సర్పంచ్ బొమ్మిడి నయొమ్మి సతీష్ కి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు వేతనాలను సకాలంలో చెల్లించాలని, 104 వైద్య సేవలను ప్రభుత్వమే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా సేవలందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరారు.