కాకినాడ రూరల్ లో కార్తీకమాసం మూడో ఆదివారం సందడి మొదలైంది. ఓ వైపు భక్తిభావంగా దేవాలయాల సందర్శన, మరోవైపు ముక్తి మార్గంగా నదీ స్నానాల పేరుతో సరదా కేరింతలతో సందడి చేశారు. కార్తీకమాసంలో కాకినాడ రూరల్ లో బంధుమిత్రులు కుటుంబ సభ్యులతో కలసి పుణ్యక్షేత్రాల సందర్శన చేస్తూ, సముద్ర స్నానాలతో బీచ్‌లలో సందడి చేశారు. ఆటపాటలతో సరదాగా గడిపారు. అనంతరం పోటీలో విజేతలకు ముఖ్య అతిథులు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.