తడి చెత్త నుంచి బయో గ్యాస్‌ను ఉత్పత్తి చేసే బయోమెథనేషన్ ప్లాంట్‌ను కాకినాడ నగరంలోని దుమ్ముల పేటలో ఏర్పాటు చేస్తున్నట్లు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ఇంటి వద్ద విలేకరులతో మాట్లాడారు. పీపీపీ విధానంలో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్ నిర్మాణ పనులకు దుమ్ములపేటలో రైల్వే ట్రాక్ వద్ద గలరుచి ఆయిల్ కంపెనీ సమీపంలోశంకుస్థాపన చేస్తున్నట్లు తెలిపారు.