కాకినాడ రూరల్ శలపాకలో ముగ్గురిని హత్య చేసిన ఘటనలో నిందితులైన పొట్లకాయల నాగేశ్వరరావు, బేబి, సుబ్రహ్మణ్యం, వినోద్‌కుమార్, దొరబాబులను అదుపులోకి తీసుకున్నట్లు కాకినాడ డిఎస్పీ రఘువీర్ విష్ణు తెలిపారు. బుధవారం కాకినాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అచ్చు చేసేందుకు ఉపయోగించిన ఆయుధాలు ఎక్కడ ఉన్నాయని, ఇతర వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.