వైసిపి ప్రభుత్వం చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి సంవత్సర కాలం పూర్తయిందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి మండలం రామవరంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్కిల్ డెవలప్మెంట్ కేసును సాకుగా చూపించి, ఏ ఆధారాలు లేకపోయినా, చంద్రబాబును అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేయాలని ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి అతని ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందన్నారు.