భారతదేశ సంస్కృతి, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పి అంతర్జాతీయంగా తన మాతృదేశాన్ని సగర్వంగా తలెత్తుకునేలా చేసిన మహానీయుడు స్వామి వివేకానంద అని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. భీమవరం కలెక్టరేట్లో అనపర్తి శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో వివేకపథం - 2025 పేరిట ముద్రించిన స్వామి వివేకానంద జీవితం - సందేశం ఫోల్డర్ ను సోమవారం ఆమె ఆవిష్కరించారు.