జిల్లాల పునర్విభజన జరిగి రెండేళ్లు పూర్తైన ఇంకా పలు ప్రభుత్వ కార్యాలయాలు తూర్పు గోదావరి జిల్లా పేరిట కొనసాగటం విస్మయం కలిగిస్తోంది. అమలాపురం సహాయ సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం నేటికీ తూర్పు గోదావరి జిల్లా పేరుతో ఉండటంపై శనివారం పలువురు విమర్శులు చేస్తున్నారు. నిత్యం ఈ కార్యాలయానికి అధికారులు, ఉద్యోగులు ఎంతో మంది వస్తూ ఉంటారని అయినప్పటికీ దాన్ని డాక్టర్ బీ. ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్పు చేయలేదన్నారు.