పిడుగురాళ్ల పట్టణంలో కొన్ని రోజుల క్రితం బాధితులు మొబైల్స్ ను వివిధ కారణాలతో పోగొట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో పలువురు బాధితులు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ వెంకట్రావు దర్యాప్తు చేసి బాధితులకు గురువారం సెల్ ఫోన్లను అందించారు. వీటి విలువ సుమారు రూ. 50 వేలు ఉంటుందని బాధితులు పేర్కొన్నారు. పోయిన సెల్ ఫోన్లను అందించిన సీఐకి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.