గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బుధవారం గురజాల మండలం దైద అమరలింగేశ్వరస్వామి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కృష్ణానది ఒడ్డున సహజ సిద్ధంగా కొండ బిలంలో వెలసిన అమరలింగేశ్వరస్వామి ఎంతో మహిమగల దేవుడన్నారు. జిల్లాలో దైదను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు దేవాలయం వద్ద కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.