దాచేపల్లిలో ప్రైవేట్ కోల్డ్ స్టోరేజ్ సమీపంలో జూదం ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను గురువారం అరెస్టు చేసినట్లు దాచేపల్లి ఎస్ఐ పాపారావు తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ. 12,000ల నగదు, పేకాట పత్తాలు స్వాధీనం చేస్తున్నట్లు చెప్పారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలపై ప్రజలు ముందుకు వచ్చి సమాచారం అందించాలని సూచించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టబద్ధంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.